“ఫ్యాన్స్” కి పిచ్చెక్కిస్తున్న “కొణిదెల” డైలాగ్..!!!
వియన విధేయ రామ..ఎవరి మాటా వినేలా లేదు…ఇప్పటికే టీజర్ దుమ్ము రేపెస్తోంది. అంతేకాదు ఈ టీజర్ లో రాంచరణ్ చెప్పిన రెండు డైలాగుల్లో ఒక డైలాగ్ మాత్రం ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తోంది. బోయపాటి దర్శకత్వం తాలూకు చాయలు ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని టీజర్ చూడగానే చెప్పేయచ్చు. అయితే ఈ టీజర్ లో మొత్తం రెండు డైలాగులు ఉన్నాయి..
మొదటిది టీజర్ ఎంట్రీ లోనే చరణ్ “అన్నా వీడిని భయ పెట్టాలా.. చంపేయాలా” అంటూ చెప్పిన డైలాగ్ ఒకటి అయితే మరొకటి టీజర్ చివరిలో “రేయ్ మన్యం పరుశురాం అయితే ఏంట్రా”.. ఇక్కడ రామ్ “కొణిదెల” రామ్ అంటూ తన ఇంటిపేరు తోనే చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ ని షేక్ చేస్తోంది..అసలైన తన ఇంటిపేరు ని సినిమాలో కూడా పెట్టుకున్నాడు చరణ్..మరి ఫ్యాన్స్ కి కనువిందు చేసే ఎన్నో రకాల ట్విస్ట్ లు ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది.