నంద్యాలలో…చంద్రబాబుకి..జగన్ మరో షాక్

 

నంద్యాల లో ఎన్నికల హీట్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సినీరంగం నుండి భారిగా మద్దతు ఉండేది.కానీ ఇప్పుడు ఆ సినీ జోరు వైఎస్సార్ పార్టీ వైపు వీస్తోంది. చివరికి తెలుగు దేశం తరుపున అవకాశాలు లేక పడిగాపులు కాస్తున్న మాజీ కామెడీ యాక్టర్ వేణుమాధవ్ ప్రచారం చేయవలసిన పరిస్తితి ఏర్పడింది.ఇక బాలకృష్ణ వచ్చి ఏదో చేసేస్తాడు అనుకుంటే  నేషనల్ మీడియా కి ఎక్కి బాబుకి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టాడు. జగన్ పక్కా ప్లానింగ్ తో ఎన్నికల్లో దూసుకేళ్తున్నాడు.ఇప్పుడు జగన్ మరో స్కెచ్ తో తెలుగుదేశం పార్టీకి మరో  పెద్ద షాక్ ఇచ్చాడు.

సంబంధిత చిత్రం

వైఎస్సార్ పార్టీ లోకి టాలీవుడ్ మ‌న్మ‌థుడుకింగ్ నాగార్జున  చేరుతున్న‌ట్టు ఆ మధ్య సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి.ఇప్పుడు నంద్యాలలో జరుగుతున్న పరిణామాలు నాగ్ ఎంట్రీ ని  డిసైడ్ చేశాయి. వైఎస్సార్ పార్టీ కి రోజు రోజు కి సెలబ్రిటీల సపోర్ట్ పెరిగిపోతోంది. మొన్నటికిమొన్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ మద్దతు పలకగా, ఇప్పుడు  అక్కినేని నాగార్జున అభిమానులు అండగా నిలిచారు. ఎన్నికల్లో తాము శిల్పాకు సంపూర్ణ మద్దతిస్తున్నట్టు ఆలిండియా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రామరాజు ప్రకటించారు.

నాగ్ అభిమానులంతా శిల్పాకు ఓటేసి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ అభిమానులు కూడా వైఎస్సార్ పార్టీ కి నంద్యాల ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని  కృష్ణ తమ్ముడు  నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్రకటించిన విషయం తెలిసిందే.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *