మెగా”స్టార్” కండీషన్లకి షాకైన కొరటాల..!!

“ఖైదీ నెం.150” లాంటి కమర్షియల్ మూవీ తో టాలీవుడ్ కి  రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఆయన అభిమానులకు వెండితెరపై కన్నుల పండగ అందించారు. దానికి పూర్తి భిన్నమైన కధతో ఒక చారిత్రిక యోధుడి పాత్రలో “సైరా నరసింహారెడ్డి” గా మెగా స్టార్ తన నటనతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కళ్ళకి కట్టినట్టు చూపించారు.  ప్రస్తుతం చిరు,కొరటాల శివ కాంబోలో ఒక చిత్రం సెట్స్ పైకి వెళ్ళిన విషయం అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంభందించి చిరు, త్రిషలపై ఒక పాటను చిత్రీకరించారు. ఈ నేపధ్యంలోనే కొరటాల శివకు మెగా స్టార్ ఒక షాక్ ఇచ్చారు. అదేంటంటే ..

 

అనవసర సన్నివేశాలను ముందుగా పేపర్ మీద ఎడిట్ చేసుకుని ఆ తరువాత సెట్స్ పైకి తీసుకువెళ్ళాలని, ఈ చిత్ర షూటింగ్ 90 రోజులలో పూర్తి అవ్వలని సూటిగా చెప్పేశారట మెగాస్టార్. ఇక ఈ చిత్రం మ్యాట్నీ ఎంటర్టైన్మెంట తో కలిసి కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్  నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో చిరు దేవాదాయ ధర్మాదాయ శాకలో ఉదోగిగా కనిపిస్తారు. మూవీ టైటిల్ విషయమై ఇంకా స్పష్టత రాలేదు కాని, “గోవిందాచార్య”, “ గోవిందా హరి గోవిందా “ ఈ రెండిటిని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

 

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.