నంద్యాలలో మైనార్టీల మొగ్గు వైసీపీకే… ఒవైసీ సపోర్ట్..
కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి జరుగుతోన్న ఉప ఎన్నిక ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు ఓటములకు మైనార్టీ ఓట్లు అత్యంత కీలకం. ఈ ఓట్లే అభ్యర్థి విజయావకాశాలను నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి. ముస్లిం మైనార్టీలను ఆకర్షించడానికి అటు తెలుగుదేశం, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు చేయనిప్రయత్నమంటూ లేదు.

పట్టణంలో ఏకంగా 60 వేల మైనార్టీ ఓటర్లు ఉన్నారు. దీంతో ఇప్పుడు వీరి మద్దతు ఇరు పార్టీలకు కీలకం కానుంది. మైనార్టీలకు ముందు నుంచి వైసీపీ వైపే ఉంటున్నారు. ఇప్పుడు మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ జగన్ పార్టీకి మద్దతు ప్రకటించబోతున్నట్టు తాజా సమాచారం. ఒకటిరెండు రోజుల్లో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా చెబుతున్నారు.
జగన్ తండ్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పటి నుంచి మజ్లిస్‌తో ఆయన చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు. ఇక ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని మజ్లిస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు జగన్‌కు మద్దతు ఇస్తే రేపు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లలో పోటీ చేయవచ్చన్నదే ఒవైసీ ప్లాన్‌గా సమాచారం.
అందుకే ఇప్పుడు ఆయన నంద్యాలలో జగన్ పార్టీకి తమ మద్దతు ఇవ్వనున్నారని, దీనిపై రేపో మాపో ప్రకటన చేస్తారని టాక్. అదే జరిగితే నంద్యాలలో మైనార్టీలు వైసీపీకి బాగా ప్లస్ అవుతారు. ప్రస్తుతం ఒవైసీపీ జగన్‌కు మద్దతు ఇస్తారన్న వార్త చంద్రబాబును బాగా టెన్షన్ పెడుతోందట.