జ‌గ‌న్‌కు రామోజీ టాప్ ప్ర‌యారిటీ…లోగుట్టు ఇదే…

ఈనాడు మీడియా సంస్థ‌ల అధినేత రామోజీరావుకు, వైఎస్ ఫ్యామిలీకి ముందు నుంచి అంత స‌ఖ్య‌త వాతావ‌ర‌ణం లేదు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సీఎం అయిన‌ప్పుడు ఈనాడులో చాలా నెగిటివ్ వార్త‌లు వ‌చ్చాయి. ఇక అదే టైంలో వైఎస్ కూడా రామోజీకి చెందిన మార్గ‌ద‌ర్శితో పాటు ఈనాడు సంస్థ‌ల‌ను చాలా టార్గెట్‌గా చేసుకున్నారు. ఇక వైఎస్ తర్వాత ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ కూడా ప‌దే ప‌దే ఈనాడు మీడియాతో పాటు రామోజీరావుపై చాలా విమ‌ర్శ‌లు చేశారు.
ఈనాడు మీడియా టీడీపీ అనుకూల మీడియా అంటూ ఆయ‌న తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఇదిలా ఉంటే తాజాగా శుక్ర‌వారం రామోజీ మ‌న‌వ‌రాలు పెళ్లికి జ‌గ‌న్ హాజ‌ర‌య్యారు. ఈ వేడుకకు వచ్చిన జగన్ ను అత్యంత అభిమానంగా రామోజీరావు స్వాగతం పలకడం నిన్నటి రామోజీరావు మనవరాలి పెళ్ళిలో హాట్ న్యూస్ గా మారింది. అంతేకాదు ఈ పెళ్ళికి ఎందరో ప్రముఖులు వచ్చినా వారందరికంటే కొంచెం ఎక్కువగా జగన్ ఈ పెళ్ళికి వచ్చిన వార్తలను ఈ టీవి ప్రసారం చేయడం వెనుక లోగుట్టు ఏంట‌న్న‌ది ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. 
ఇక ఏపీ సీఎం చంద్ర‌బాబు-రామోజీకి కొద్ది రోజులుగా గ్యాప్ న‌డుస్తోంద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. చంద్ర‌బాబు రామోజీ కంటే రాధాకృష్ణ‌కే ప్ర‌యారిటీ ఇస్తున్నాడు. c అనే కోణంలో కూడ కామెంట్స్ వినిపిస్తున్నాయి.  
ఇక చంద్ర‌బాబు రాధాకృష్ణ‌కు ఎక్కువ ప్ర‌యారిటీ ఇవ్వ‌డంతో రామోజీ జ‌గ‌న్‌ను మ‌రీ దూరం చేసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదా ?  తాజాగా పెళ్లిలో జ‌గ‌న్‌కు బాబుతో స‌మానంగా ప్ర‌యారిటీ ఇవ్వ‌డం వెన‌క ఇది కూడా ఓ కార‌ణ‌మా ? అని కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. 
Also Read : http://www.telugustarnews.com/telugu/tsr-jump-into-ysrcp/

వైసీపీలోకి టీఎస్సార్‌… బాబాయ్‌కు జ‌గ‌న్ షాక్‌

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *