కరోనా వైరస్ – కటిన పాశానానికి అయినా కన్నీళ్లు ఆగవు

కరోనా వైరస్ ఎంతో మంది ప్రాణాలని బలి తీసుకుంది. ఎంతో మంది తల్లులకి కడుపు కోత మిగిల్చింది. చైనా లో ఈ వైరస్ భారిన పడిన వారి జీవితాలని, అక్కడి పరిస్థితులని సోషల్ మాధ్యమాలలో ఎంతో మంది పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో గుండెల్ని పిండేస్తోంది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

😢😥😢

Publiée par Kunala V Raö sur Vendredi 31 janvier 2020

కరోనా వైరస్ సోకన నెలలు కూడా నిండని పసి గుడ్డుని ఓ రక్షణ వలయంలో ఉంచారు. తన తండ్రి అక్కడికి చేరుకోగానే ఆ పసిపాప నన్ను ఎత్తుకో నాన్నా అన్నట్టుగా చేతులు చాచుతూ తండ్రి ప్రేమ కోసం ఎగబడటం, నన్ను ఇక్కడి నుంచీ తీసుకోపో నాన్నా అన్నట్టుగా ముఖం దిగాలుగా పెట్టడం, తన తండ్రి తనని చూసి వెళ్లి పోవడంతో కళ్ళు పెద్దవి చేస్తూ తండ్రివైపు తదేకంగా చూడటం ఈ ఘటన తాలూకు వీడియో చూస్తే కటిన పాశానానికి అయినా  కన్నీళ్లు ఆగవు..ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎవరికీ రాకూడదంటూ వేడుకుంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *