బిగ్ బ్రేకింగ్ – పదవీ విరమణ వయసు 61 ఏళ్ళు పెంపు…!!!

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 గా ఆయన తీసుకున్న నిర్ణయం తెలంగాణ ఉద్యోగులలో సంతోషం నింపింది. ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ తమకి న్యాయం చేస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు. అయితే  ఈ నిర్ణయాన్ని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లుగా  తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫైలును మంత్రివర్గ సమావేశం నాటికి సిద్ధం చేసి ఉంచాలని సంబంధిత అధికారులను కెసిఆర్ ఆదేశించినట్లు గా తెలుస్తోంది.

Image result for కెసిఆర్

ఇదిలాఉంటే ఈ ఆదేశాల ప్రకారం 2023 మార్చి 31 నాటికి పదవీ విరమణ చేయనున్న సుమారు ఇరవై ఆరు వేల 133 మంది ఉద్యోగులకు మరో మూడేళ్ల పాటు అదనపు సర్వీసు కలిసొస్తోంది. గతంలో ఉన్నత అధికారుల కమిటీ ఈ పెంపు వర్తింప చేయకూడదన్న సిఫార్సులను  చేసినా కేసీఆర్ వాటిని పక్కన పెట్టిమరీ ఉద్యోగుల కోసం తాను  ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి తగ్గట్టుగానే  61 ఏళ్ల నిబంధనలను సీఎం అమలు చేయనున్నట్లు సమాచారం అందుతోంది

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *