మళ్ళీ ఏపీ “ క్యాబినేట్ విస్తరణ”…?

చంద్రబాబు మళ్ళీ ఏపీ కేబినేట్ ని విస్తరిస్తున్నారా ? ఇదే ఎన్నికల టీం అని ఇంతక క్యాబినెట్ మార్పులలో తీసుకున్న మంత్రుల్ని పరిచయం చేసిన బాబు..మరొక్కసారి తన టీం లో మార్పులు చేర్పులు చేయబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.దీనికి అవును అనే సమాధానం కూడా వస్తోంది. ఇంతక ముందు మార్పులు చేర్పులు చేసినపుడు రగిలిన అసమ్మతి ఇంకా చల్లారలేదు.అయినా మళ్ళీ చంద్రబాబు ఎందుకు మంత్రి వర్గ విస్తరణ చేస్తున్నారు అంటే..తన టీం తన అంచనాలని అందుకోలేక పోవడమే కారణం అట.

ap Cabinet expansion కోసం చిత్ర ఫలితం

మరో పదిరోజుల్లో ఈ తీసివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారట బాబు సుమారు ఐదుగురు లేదా ఆరుగురు మంత్రుల్ని తప్పించి..ఆ భర్తీని వేరే వాళ్ళతో భర్తీ చేస్తారు అని టీడీపి వర్గాలు తెలిపాయి.వీరిలో చాలా మంది మంత్రులు,ఎమ్మెల్యేలలో చాలా మందికి పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు అని భావిస్తున్నారట చంద్రబాబు. ఎవరెవర్ని తొలగించాలో ఒక క్లారిటీ లోనే ఉన్నారట చంద్రబాబు..ఆయన సన్నిహితుల ద్వారా వచ్చిన సమాచారం మేరకు తీసివేత లిస్టు లో అయ్యన్నపాత్రుడు పేరు ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రతీసారి ఘంటా ని ఉద్దేశించి మాట్లాడే అయ్యన్న పార్టీకి తీవ్రమైన నష్టం తీసుకువస్తున్నారు అందుకే ఆయన పేరు లిస్టు లో ఉందని టాక్.

 ఇంకా ఇక కామినేని స్థానంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుకు మంత్రి పదవి ఇవ్వాలని కేంద్ర పెద్దలు సిఫార్సు చేసే అవకాశాలు ఉన్నాయి. మంత్రి పత్తిపాటి ని తప్పించి స్పీకర్ కోడెల శివప్రసాద్ కి అవకాసం ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట. మహిళల కోటాలో  బలిజ సామాజిక వర్గంలో మహిళలకి అవకాశం  బలిజ సామాజికవర్గానికి చెందిన డి.కె.రత్నప్రభ పేరు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చింద‌ట‌.. మంత్రికొల్లు ర‌వీంద్ర‌ను త‌ప్పించి కాకినాడ ఎమ్మెల్యే కొండ‌బాబుకు అవ‌కాశం ఇవ్వాల‌ని భావించినా.. కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆయ‌న‌ సిఫార్సు చేసిన వార్డు సభ్యులు ఓడిపోవడం మైన‌స్‌గా మారింది.

ఇది ఇలా ఉంటే ఈ విషయంలో నిజం లేదని ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి అని చంద్రబాబు అంటున్న తరుణంలో ఇలా క్యాబినెట్ విస్తరణ చేసే సాహసం బాబు చేయరు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *