బ్రేకింగ్ – “జనసేన” లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉండవల్లి…!!!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర  వ్యాప్తంగా ఉన్న జిల్లాలలో  మెల్ల మెల్లగా పట్టు సాధిస్తున్నారు ఈ నేపధ్యంలోనే పార్టీలకి అత్యంత కీలకమైన లీగల్ సెల్ లని ఏర్పాటు చేస్తున్నారు..తాజాగా పవన్ సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావారి జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ ఉద్యక్షుడిగా  ఉండవల్లి ని నియమిస్తూ పవన ఉత్తర్వులు జారీ చేశారు..ఇలా మొత్తం అన్ని జిల్లాలకి లీగర్ సెల్ అధ్యక్షులని ఏర్పాటు చేస్తున్నారు పవన్ కళ్యాణ్.

Image result for janasena party legal cell

భీమవరం పట్టణానికి చెందిన ఉండపల్లి రమేష్‌నాయుడుని ఎంపిక చేయడం ఎంతో సంతోషమని పట్టణానికి చెందిన పార్టీ తెలిపారు.. ప్రస్తుతం 11 జిల్లాలకు న్యాయ విభాగం జిల్లా అధ్యక్షులను నియమిస్తు పార్టీ కేంద్ర కార్యాలయం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. రమేష్‌నాయుడు ప్రస్తుతం చిరుపవన్‌తేజం వ్యవస్థాపక అధ్యక్షుడిగా, మెగాఫ్యాన్స్‌ జిల్లా అధ్యక్షుడిగా, కాపు యువసేన జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Related image

అంతేకాదు 2009లో ప్రజారాజ్యంలో చేరి యువరాజ్యం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2014లో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అప్పటి నుంచి రాజకీయాలలో కొనసాగుతున్నారు. జనసేన పార్టీ ప్రారంభించాక ఆ పార్టీ అనుచరుడిగా ఉంటున్నారు. తాజా నియామకాలలో రమేష్‌నాయుడి సేవలు గుర్తించిన పవన్‌కల్యాణ్‌ ఆయనకు ఈ పదవిని అప్పగించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *