సరికొత్తగా..రీ ఎంట్రీ ఇస్తున్న రేణూ దేశాయ్..!!!

బద్రీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రేణూ దేశాయ్ ఆ తరువాత జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన మరో సారి కనపడింది. పవన్ తో తెగతెంపులు చేసుకున్న తరువాత  సినిమాలకు దూరంగా ఉన్న రేణూ చిన్న చిన్న షో లకు గెస్ట్ గా వెళ్ళింది. ఇక మళ్ళీ చాలా గ్యాప్ తరువాత కెమెరా ముందుకు రావడానికి సిద్దమయ్యింది. రేణూ రీ ఎంట్రీ ఎలా ఉండబోతోందంటే.

Renu Desai to finally make her Tollywood comeback? Read details here |  Telugu Movie News - Times of India

కృష్ణ మామిడాల అనే దర్శకుడు తీయబోతున్న వెబ్ సీరీస్ కి ఒకే చెప్పిన రేణూ ఈ వెబ్ సీరీస్ లో ప్రధాన పాత్ర పోషించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో ఆమె ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ సిఈవో గా నటించబోతున్నట్టుగా తెలుస్తోంది..

Annadatha Sukheebhava host Renu Desai has a message for fans on son Akira's  birthday - Times of India

అంతేకాదు ఈ సీరీస్ కి ఆద్యా అనే పేరుని కూడా ఫిక్స్ చేశారట. రేణూ కూతురు పేరు కూడా ఆధ్యానే కావడంతో ఈ సీరిస్ పై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రేణూ ఈ సరికొత్త జర్నీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *