డ్ర‌గ్స్ ఎఫెక్ట్‌తో ఆ హీరో ఫ్యూచ‌ర్ క్లోజ్‌…

టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపేస్తోన్న డ్ర‌గ్స్ ఇష్యూ ఇప్పుడు ఎంతోమంది ప్ర‌ముఖులు గుండెళ్లో రైళ్లు ప‌రిగెట్టిస్తోంది. సిట్ విచార‌ణ‌లో ఒక్కొక్క‌రు షాకింగ్ విష‌యాలు వెల్ల‌డిస్తుండ‌డంతో చాలా మందికి శిక్ష త‌ప్ప‌ద‌ని తేలుతోంది. ఈ క్ర‌మంలోనే యంగ్ హీరో న‌వ‌దీప్ ఫ్యూచ‌ర్ క్లోజ్ అవ్వ‌క‌త‌ప్ప‌దా ? అన్న చ‌ర్చ‌లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. స్వయంగా పబ్ నిర్వహిస్తున్న నవదీప్.. ఆ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్ నడిపిస్తున్నట్లు సిట్ అధికారులు కీలక ఆధారాలు దొరకబట్టారు.
డ్రగ్ సప్లయర్ కెల్విన్ నుంచి సినీ ఇండస్ట్రీలోని మాదక ద్రవ్యాల వాడకం దారులకు ఇక్కడ నుంచే పంపిణీ అవుతాయన్న విష‌యంపై పోలీసులు ప్రాథ‌మికంగా నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు అంద‌రూ ఈ పబ్ లోనే కూర్చుని డ్రగ్స్ తీసుకుంటారట. సినీ ఇండస్ట్రీని శాసించే పెద్ద కుటుంబాల పిల్లలు సైతం నవదీప్ పబ్ కస్టమర్లని సిట్ అధికారులు వివరాలు సేకరించారు.
న‌వ‌దీప్ నిర్వ‌హించే బీపీఎం పబ్ సహా క్లౌడ్ నైన్, వాటర్స్ పబ్, టెన్ డౌనింగ్ స్ట్రీట్, లిక్విడ్స్, డూప్లిన్ పబ్స్‌లోనూ డ్రగ్స్ అమ్మకాలు జరిగినట్టు సిట్ గుర్తించింది. న‌వ‌దీప్ ఈ నెల 24న సిట్ విచార‌ణ ఎదుర్కోనున్నాడు. ఈ డ్రగ్స్ కేసులో డీప్ గా ఇరుక్కున్నే వాళ్లలో నవదీప్ కూడా ఉంటాడనేది విశ్లేషకుల మాట. కెల్విన్, పూరీ, ఛార్మిల కంటే ఎక్కువ‌గా న‌వ‌దీప్ ఈ కేసులో ఎక్కువుగా బుక్ అవుతాడ‌ని, అదే జ‌రిగితే న‌వ‌దీప్ ఫ్యూచ‌ర్ దాదాపు క్లోజ్ అయిన‌ట్టేన‌ని ప్రాథ‌మిక అంచ‌నాల ద్వారా తెలుస్తోంది.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *