కత్తి పట్టిన “వినయ విధేయ రామ”

మెగా అభిమానుల కోసం మెగా స్టార్ తనయుడు రాంచరణ్ నటిస్తున్న బోయపాటి దర్సకత్వంలో తెరకెక్కుతున్న  “వినయ విధేయ రామా” సినిమా ఫస్ట్ లుక్ ని కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు చిత్ర యూనిట్. రంగస్థలం సూపర్ డూపర్ హిట్  తరువాత ఈ సినిమా మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు ఎందుకంటే మాస్ ని ఆకట్టుకోవడంలో రాంచరణ్ , మాస్ ఎలిమెంట్స్ తీయడంలో బోయపాటి ఇలా ఇద్దరి కలయికపై వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి అయితే ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో

రాంచరణ్ 'వినయ విధేయ రామ' ఫస్ట్ లుక్ అదుర్స్!

ఈ అంచనాలు ఏ మాత్రం వమ్ము చేయలేదని టాక్ కూడా వినిపిస్తోంది..ఈ చిత్రంలో చరణ్ సరసన కథానాయికగా కైరా అద్వాని నటిస్తుండగా ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది…ఈ ఫస్ట్ లుక్ లో చరణ్ కత్తి పట్టుకుని మట్టితో నిండిన వంటితో ఎంతో రౌద్రంగా పరిగెత్తుకుంటూ వస్తున్న లుక్ అభిమానులని , సినిమా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలాఉంటే ఈ సినిమా టీజర్ ని ఈ నెల ఈ నెల 9వ తేదీన ఉదయం 10:25 గంటలకి విడుదల చేయనున్నారు.

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *