చిరు ‘ సై రా న‌ర‌సింహారెడ్డి ‘ మోష‌న్ పోస్ట‌ర్ (వీడియో)

ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి చేయ‌బోతున్న త‌దుప‌రి సినిమా ఇదే. బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి అనే వీరుని క‌థ‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌ని తెలిసిందే. ఇది చిరంజీవికి 151వ సినిమా. అయితే చాలా గ్యాప్ త‌రువాత చిరంజీవి ఖైదీ నంబ‌ర్ 150 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఇప్పుడు అచ్చ‌మైన తెలుగు క‌థ‌, ఒక యోధుని పాత్ర‌లో ఆయ‌న ద‌ర్శ‌న‌మిస్తుండ‌డంతో ఈ సినిమాపై అంద‌రిలోనూ అంచ‌నాలు భారీగానే పెరిగాయి.

వ‌చ్చే ఏడాది వేస‌విలో ఈ సినిమా విడుద‌ల‌య్యేందుకు చాన్స్ ఉండ‌గా, ఇప్పుడీ సినిమాకు చెందిన టాపిక్ ఏదైనా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చల్ చేస్తోంది. ప్ర‌ధానంగా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి గాథ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ అయ్యింది. దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *