ఆ ఒక్క ప‌థ‌కంతో టీడీపీకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తోన్న జ‌గ‌న్‌

వైసీపీ అధినేత జగన్ రైతులకు వరాలు ప్రకటించారు. ప్లీనరీ వేదికగా ఆయన అనేక హామీలను గుప్పించారు. తాను అధికారంలోకి రాగానే రైతుల కోసం ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్లీన‌రీ రెండో జ‌గ‌న్ మాట్లాడుతూ ఐదెకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 50వేలు ఇస్తాం. ఏటా రూ. 12,500 చొప్పున మే నెలలో ఒకేసారి ఈ మొత్తాన్ని నేరుగా రైతుల చేతికే ఇస్తాం. మే నెలలో రైతులు వ్యవసాయ సన్నద్ధమయ్యే సమయానికి అందజేస్తాం. బ్యాంకులు తమ బకాయిలకు జమ చేసుకోకుండా నేరుగా రైతులకే అందిస్తామ‌ని జ‌గ‌న్ చెప్పారు.
కులమతాలకు అతీతంగా ఐదెకాలలోపు ఉన్న ప్రతి రైతుకూ ఈ పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పారు. ఈ పథకం కింద 33 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఇక రైతులకు బ్యాంకు రుణాలను జీరో పర్సెంట్ వడ్డీకే అందేలా కృషి చేస్తామని చెప్పారు. వైఎస్ ఆర్ రైతు భరోసా కార్యక్రమం కింద రైతు సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలను చేపడతామన్నారు. తాను మాట మీద నిలబడే వ్యక్తినని, చంద్రబాబులాగా హామీ లిచ్చి మోసం చేసే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.
ఏదేమైనా జ‌గ‌న్ ప్ర‌క‌టించిన ఈ ప‌థ‌కం ఇప్పుడు టీడీపీ గుండెళ్లో రైళ్లు ప‌రిగెత్తిస్తోంది. ఈ ఒక్క ప‌థ‌కం దెబ్బ‌తో చంద్ర‌బాబు హామీల‌తో విసిగి వేసారి పోయిన రైతులంద‌రూ గంప‌గుత్త‌గా టీడీపీకే ఓట్లేస్తార‌న్న చ‌ర్చ‌లు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఏదేమైనా ఈ ఒక్క ప‌థ‌కం దెబ్బ‌తో ఇప్పుడు రైతుల్లో పాపుల‌ర్ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు రైతు రుణ‌మాఫీ ప్ర‌క‌టించినా…దానిని పూర్తిగా అమ‌లు చేయ‌డంలో ఫెయిల్ అవుతున్నాడు. ఇక ఇప్పుడు జ‌గ‌న్ ఈ ప‌థ‌కాన్ని తాను స‌క్రమంగా అమ‌లు చేస్తాన‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌గ‌లిగితే టీడీపీకి ఇబ్బందులు త‌ప్ప‌వు.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *